• Other News
  • Live TV
  • ఐనాల వారి ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కోసం సహాయ, సహకారాలు అందించిన వారందరికి కృతజ్ఞతలు

    Reporter
    admin June 5, 2026, 5:49 pm
    ఐనాల వారి ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కోసం సహాయ, సహకారాలు అందించిన వారందరికి కృతజ్ఞతలు

    స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ఛైర్మన్ ఐనాల పరశురాములు
    వార్త ప్రతిక :-మరిపెడ
    మే 31వ, తేదీన ఎల్లంపేట లో జరిగిన ఐనాల వారి ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కోసం సహాయ సహకారాలు అందించిన వారందరికి కృతజ్ఞతలు అని స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ ఐనాల పరశురాములు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో గురువారం రాత్రి ఐనాల వారి ఆత్మీయ సమ్మేళనం విజయోత్సవ సభ ఐనాల సురేష్ అధ్యక్షతన జరిగింది. ఇట్టి కార్యక్రమానీకి ఐనాల పరశురాములు పాల్గొని ఆయన మాట్లాడుతూ ఇటివల స్థానిక వివిఎన్ ఫంక్షన్ హాల్ లో ఐనాల వారి ఆత్మీయ సమ్మేళనం ఊహించని విధంగా జరిగిందని ఈ కార్యక్రమానికి ఐనాల వారు తమ స్వంత డబ్బులతో నిర్వహించారని కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని మంత్రముగ్ధుల్ని చేశాయని, ఈ కార్యక్రమ రూపకల్పన, అన్ని విభాగాల పనులు ఎవరిపైనా ఆధారపడకుండా ఐనాల వారే నిర్వహించారని తెలిపారు.మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట, మరిపెడ, అబ్బాయిపాలెం,చిల్లంచర్ల,ఉగ్గంపల్లి,నేరడ , తట్టుపల్లి, కంబాలపల్లి, చిన్ననాగారం, హైదరాబాద్,సూర్యాపేట జిల్లా కుక్కుడం, ఖమ్మం జిల్లా, కేజీ సిరిపురం, పినపాక,అమ్మపాలెం, పాతర్లపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్టం తిరువూరు, కాకర్ల, శ్రీరాంపురం తోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఐనాల వారు 1,000 మందికి పైగా పాల్గొన్నారు, ఐనాల వారి ఐక్యత, విద్య, వైద్య ,ఉపాధి, సామాజిక సేవే లక్ష్యంగా జరిగిన సమ్మేళనానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన గ్రామ సర్పంచ్ గండి రాధమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది,వివిఎన్ ఫంక్షన్ హాల్ యజమాని వెన్నె వీరయ్య, మెడికల్ ఆఫీసర్ గుగులోత్ రవి, ఆశ వర్కర్లు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, ముఖ్యంగా ఐనాల వారి ఆడబిడ్డలు ఇచ్చిన సహకారం మరువలేనిదని వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ఐనాల వారి ఆత్మీయ బంధువులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం కల్చరల్ టీం చిన్నారులకు, తదితరులలకు ఘనంగా సన్మానం చేశారు.ఇట్టి కార్యక్రమలో ఐనాల బిక్షం, ఐనాల వీరస్వామి,ఐనాల పుల్లయ్య, ఐనాల నర్సయ్య,ఐనాల బాబు, ఐనాల కృష్ణ, ఐనాల వెంకన్న, ఐనాల మధు, ఐనాల మహేష్, ఐనాల రాము, ఏర్పుల శ్రీను, ఐనాల నాగయ్య, ఏర్పుల వీరయ్య , ఐనాల కర్ణకర్, ఐనాల నాగార్జున, ఐనాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow