• Other News
  • Live TV
  • దివిస్ లేబరేటరీస్ నందు 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు

    Reporter
    admin June 5, 2026, 5:44 pm
    దివిస్ లేబరేటరీస్ నందు 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు

    చౌటుప్పల్ , జూన్ 05,(వార్త పత్రిక);ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దివిస్ లేబరేటరీస్ నందు పర్యావరణ పరిరక్షణ వాతావరణ మార్పులు నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమాలకు దివిస్ పరిశ్రమ ఉపాధ్యక్షులు ఎస్ రామకృష్ణ, జి హేమంత్ కుమార్ అధ్యక్షత వహించారు వాతావరణ మార్పుల నివారణకు మన చర్యలు అనే అంశంపై ఉద్యోగులందరూ ప్రతిజ్ఞ చేసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు నిబద్ధతను చాటుకున్నారు ఈ సందర్భంగా పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించే పది ఎకో లైఫ్ స్టైల్స్ అంశాలతో రూపొందించిన అవగాహన కరపత్రాన్ని దివిస్ పరిశ్రమ ఉపాధ్యక్షులు ఎస్ రామకృష్ణ ఆవిష్కరించారు అనంతరం పరిశ్రమ ఉద్యోగుల ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పర్యావరణ జీవనశైలిని అలవర్చుకోవాలని విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు దివిస్ పరిశ్రమ పర్యావరణ పరిరక్షణ విభాగానికి చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి వి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో పర్యావరణ అవగాహన ప్రదర్శన స్టాల్ ఏర్పాటు చేయబడినది ఈ స్టాల్ లో దివిస్ ఉద్యోగులు రూపొందించిన పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ నమూనాలు ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి అనంతరం ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా దివిస్ పరిశ్రమ ఆవరణలో భారీ స్థాయిలో మొక్కలు నారడం జరిగినది ఈ కార్యక్రమం
    ఎంఓఈఎఫ్& సిసి న్యూఢిల్లీ సూచనల మేరకు నిర్వహింపబడినది ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలలో దివిస్ పరిశ్రమ ఉపాధ్యక్షులు ఎస్ రామకృష్ణ,జి హేమంత్ కుమార్,జనరల్ మేనేజర్లు జి బాలకిషోర్,పి సుధాకర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డివి రాఘవేంద్రరావు,ఇతర అధికారులు మరియు ఉద్యోగులు ఉత్సంగా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేశారు

    📰 e-Paper Clip
    Google News Follow