వార్త పత్రిక షాద్ నగర్ మే 13:ఈ సందర్భంగా బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు గారు తెలంగాణ మాజీ సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరగా, గౌరవముఖ్యమంత్రిగారుసానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇతర రాష్ట్రాలలో మాజీ సైనిక కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయో, వాటి విధానాలు మరియు నమూనాలను సేకరించి త్వరలో ఒక సమావేశంఏర్పాటుచేద్దామనిసూచించారు.అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చైర్మన్‌గా ఉన్న రాజ్య సైనిక బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని బ్రిగేడియర్ ఎన్.ఆర్.బాబుముఖ్యమంత్రిదృష్టికితీసుకువచ్చారు. దీనిపై కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ ఆ సమావేశాన్ని కూడా తప్పకుండా నిర్వహిస్తామని తెలిపారు.
గౌరవ గవర్నర్ చైర్మన్‌గా ఉన్న స్టేట్ మేనేజింగ్ కమిటీ ఏర్పాటు సంబంధిత ఉత్తర్వులను త్వరగా జారీ చేయాలని బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు కోరగా, ప్రభుత్వం త్వరలోనే ఆ ఉత్తర్వులను విడుదల చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.ఇంకా మాజీ సైనికులకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే, పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శికి అందజేయాలని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మాజీ సైనికుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కూడా తెలిపారు.మాజీ సైనికుల కోసం సమయం కేటాయించి సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి కి సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ అజిత్ రెడ్డి గారు, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీనేష్ కుమార్ నోరి పాల్గొన్నారు.
TELANGANA
సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తో సమావేశమయ్యారు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది