• Other News
  • Live TV
  • ఎక్సైజ్ చట్టలకు, నిబంధనలకు విరుద్ధంగా విక్రహిస్తున్న మద్యం షాపులు వెంటనే తొలగించాలి.

    Reporter
    Journalist Chinna Telangana  |  May 13, 2026, 4:42 pm
    ఎక్సైజ్ చట్టలకు, నిబంధనలకు విరుద్ధంగా విక్రహిస్తున్న మద్యం షాపులు వెంటనే తొలగించాలి.

    వార్త పత్రిక ప్రతినిధి 13
    సిపిఐ బాచుపల్లిమండలకార్యదర్శిపాలభిందెల శ్రీనివాస్.గండిమైసమ్మ చౌరస్తా నుండి మియాపూర్ వరకు మెయిన్ రోడ్డు పై ఉన్న మద్యం పాలసీలకి విరుద్ధంగా ఉన్న మద్యం షాపులను వెంటనే తొలగించాలని సిపిఐ ఆధ్వర్యంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసు సీఐకీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ మద్యం పాలసీ ప్రకారం మెయిన్ రోడ్డులు, జాతీయ రహదారులో, గుడులు, పాఠశాలలకు కనీసం వంద మీటర్ల దూరంలో మద్యం విక్రహించాలి అని గుర్తు చేశారు. కానీ రహదారులో మద్యం పాలసీకి వెతిరేకంగా మెయిన్ రోడ్డుపై ఏదేచ్చగా మద్యం విక్రయలు కొనసాగుతున్నాయి అని అన్నారు. ముఖ్యంగా వి- లిక్కర్, చివాస్ వైన్ షాప్, స్పిరిట్ వైన్ షాప్, ఎస్విడీ లిక్కర్ షాప్ తదితర మద్యం షాప్లు ఎక్సైజ్ పాలసీ, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నారు అని వారు అన్నారు. రీసెంట్గా వి-లిక్కర్ వైన్ షాప్ వద్ద రహదారి పై వెళ్తున్న ఒక షిఫ్ట్ కారు సడన్ గా వి-లిక్కర్ వైన్ షాప్ వద్ద ఆగడం వల్ల వెనక నుండి వస్తున్న వాటర్ ట్యాంక్ కారును బలంగా గుద్దడం వల్ల కారు వెనక భాగం డ్యామేజ్ అయింది. అలాంటి అనేక సంఘటనలు రహదారుల పై జరగడం సర్వసధారణం అవుతున్నాయి. తద్వారా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి అని అన్నారు. కనుక మద్యం పాలసీ, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న మద్యం షాపులను వెంటనే తొలగించాలని, అలాగే నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్, ఇంద్రన్న కాలనీ, రాజీవ్ గృహకల్ప, సాయి నగర్, ఎన్టీఆర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, ఇందిరమ్మ కాలనీ, తదితర ప్రాంతాలలోని మద్యం బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పొన్నాకంటి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow