• Other News
  • Live TV
  • యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులు గా పనిచేయాలి పెద్దగోని మౌనిక గౌడ్

    Reporter
    Journalist Chinna Telangana  |  May 7, 2026, 6:23 pm
    యువజన కాంగ్రెస్ నాయకులు సైనికులు గా పనిచేయాలి పెద్దగోని మౌనిక గౌడ్

    చౌటుప్పల్, మే 07,(వార్త పత్రిక);మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ చౌటుప్పల్ లోనివ్యక్తి గత క్యాంపు కార్యాలయం లో మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ స్థాయి కార్యవర్గ సమావేశం నియోజకవర్గం అధ్యక్షులు అబ్బనబోయిన రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యమానికి ముఖ్య అతిధిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక గౌడ్ పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న మౌనిక గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాలని, యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు సైనికులుగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని మౌనిక గౌడ్ తెలియజేసారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం ఇంచార్జ్ తిరుగుడు రవి,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బు శేఖర్ గౌడ్,నియోజకవర్గం ఉపాధ్యక్షులు దొడ్డి శివశంకర్,చౌటుప్పల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ భార్గవ్, ఆవుల రాజు,పబ్బతి వెంకటేష్,ఉదరి రవి,మర్రిగూడ మండల నాయకులు ఉడుతల లవ కుమార్, మరియు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow