షాబాద్, ఏప్రిల్ 23:వార్త పత్రిక
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డిల చేతుల మీదుగా శాలువాలతో సత్కారం
షాబాద్ మండల కేంద్రంలోని మోడల్ జూనియర్ కళాశాలలో ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి విద్యార్థులను శాలువాలు, మోమెంటోలతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన విజయాలు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో కష్టపడి చదివితే మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్ధార్ నగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ కవిత, సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, అశోక్, లావణ్య చెన్నయ్య, స్వరూప మహేందర్ గౌడ్, మాణిక్యం, పావని చెన్నయ్య, శాంతమ్మ యాదయ్య, నాయకులు గుర్రాల విష్ణు వర్ధన్ రెడ్డి.జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రఫిక్, అశ్విని, మహేష్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
TELANGANA RANGAREDDY
విద్యార్థుల ప్రతిభకు ఘన సన్మానం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది