• Other News
  • Live TV
  • ఆర్టీసీ సమ్మెతో వెలవెలబోయిన చౌటుప్పల్ బస్టాండ్

    Reporter
    Journalist Chinna Telangana  |  April 23, 2026, 2:20 pm
    ఆర్టీసీ సమ్మెతో వెలవెలబోయిన చౌటుప్పల్ బస్టాండ్

    బందోబస్తు మధ్య ప్రయాణికుల నిరీక్షణ
    చౌటుప్పల్, ఏప్రిల్ 23,(వార్త పత్రిక);ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె నేపథ్యంలో చౌటుప్పల్ బస్టాండ్ వెలవెలబోయింది గురువారం బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
    సమ్మె నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బస్టాండ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, సాయుధ బలగాలు బస్టాండ్ ఆవరణలో పహారా కాస్తున్నారు. బస్సులు లేకపోవడంతో కొందరు ప్రయాణికులు బస్టాండ్‌లోనే నిరీక్షిస్తూ కనిపించారు. నిత్యం రద్దీగా ఉండే చౌటుప్పల్ బస్టాండ్ సమ్మె ప్రభావంతో నిర్మానుష్యంగా మారింది. ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు లేక విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు

    📰 e-Paper Clip
    Google News Follow