• Other News
  • Live TV
  • మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ వక్రబుద్ధి తోలుపునూరి రమేష్ గౌడ్ తీవ్ర ఆరోపణలు

    Reporter
    Journalist Chinna Telangana  |  April 18, 2026, 8:41 pm
    మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్ వక్రబుద్ధి తోలుపునూరి రమేష్ గౌడ్ తీవ్ర ఆరోపణలు

    వార్త ప్రతిక :-హైదరాబాద్
    మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బిజెపి ఓ.బీ.సీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ తోలుపునూరి రమేష్ గౌడ్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఉద్దేశపూర్వకంగా ఆపేసిన కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శించారు. దక్షిణాది అన్యాయం అనే మూర్ఖ వాదన తో మహిళలకు చేసిన భయంకర అన్యాయాన్ని కపటంగా సమర్థిస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించారో కాంగ్రెస్ స్పష్టంగా చెప్పాలని, లేకపోతే వారి మొండి ముఖం బయటపడుతుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు నిజాయితీగా న్యాయం చేయడానికి బిల్లును ఆమోదించిన చర్యను రమేష్ గౌడ్ ప్రశంసించారు. కానీ, దీనికి కూడా కాంగ్రెస్ వ్యతిరేకించడం వారి మహిళా వ్యతిరేక వైరుధ్యాన్ని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు. మహిళలకు అతిపెద్ద మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, బిజెపి త్వరలోనే మహిళా రిజర్వేషన్లను తప్పకుండాపూర్తిగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు.
    మహిళా లోకం మా వెన్నంటే ఉంటే, ఎవరూ మాకు తట్టుకోలేరు అని ఆయన ధైర్యంగా ప్రకటించారు.
    రాజ్యాంగం పేరిట ప్రజలను మోసం చేస్తూ, కేవలం రెండు-మూడు రాష్ట్రాల్లో పదవులు వున్న కాంగ్రెస్ త్వరలో అవి కూడా చేజారిపోతారని రమేష్ గౌడ్ హెచ్చరించారు. పార్లమెంట్‌లో బిల్లుకు వ్యతిరేకించి విజయం సాధించాము అని అహంకారం చెప్పుకోవడం సిగ్గుచేటు మాత్రమేనని, ప్రజలు దీన్ని మరచరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపికి బలం లేదని కాంగ్రెస్ కలలు కనుక్కుంటున్నారా ఇద్దరు కేంద్ర మంత్రులు ( కిషన్ రెడ్డి, బండి సంజయ్), రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, 8 ఎంపీ లు , 8 ఎమ్మెల్యేలు, నమ్మకమైన మహిళా కార్యకర్తలు, పార్టీ అంటే ప్రాణమిచ్చే అసలైన కార్యకర్తలు మాతోనే ఉన్నారని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్-కూటమి మహిళా రిజర్వేషన్‌పై చేసిన దారుణ అన్యాయాన్ని వివరిస్తామని ఆయన ప్రకటించారు. బిజెపి మహిళల హక్కుల కోసం ఎప్పటికీ పోరాడుతుందని, మళ్లీ వచ్చే సమావేశంలో కూడా మేము మహిళా బిల్లు పెడతామని అప్పుడు కాంగ్రెస్ కు మా బలం చూపుతామని అన్నారు కోట్లాదిమంది మహిళలకు అన్యాయం జరిగిందని దేశంలోని మహిళలందరినీ ఏకం చేసి దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్కు మహిళా ఓటు రాకుండా చేస్తామని తోలుపునూరు రమేష్ గౌడ్ అన్నారు ఇది మీరు సాధించిన విజయం లా చెప్పుకుంటున్నారు కానీ ఇది మహిళలకు జరిగిన అన్యాయంగా మహిళా బిల్లు వచ్చే వరకు మేము ఊరుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్కు వారి అనుకూల పార్టీలకు మహిళలకు అన్యాయం జరుగుతే ఎలా ఉంటుందో చూపెడతామని ఆయన అన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow