• Other News
  • Live TV
  • 22న పట్టుబడిన వాహనాల వేలం

    Reporter
    Journalist Chinna Telangana  |  April 18, 2026, 8:19 pm
    22న పట్టుబడిన వాహనాల వేలం

    వార్త ప్రతిక :-తొర్రూరు
    గుడుంబా సంబంధిత కేసుల్లో పట్టుబడి సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 22న వేలం వేయనన్నట్లు తొర్రూరు ఎక్సైజ్ సీఐ బూస అశోక్ తెలిపారు.
    తొర్రూరు ఎక్సైజ్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన వాహనాలను ఈనెల 22(బుధవారం) ఉదయం 8 గంటలకు వేలం వేస్తామని తెలిపారు. వరంగల్ డిప్యూటీ కమిషనర్‌ జి. అంజన్ రావు ఆదేశానుసారం
    సహాయ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జిల్లా సూపరింటెండెంట్‌ సమక్షంలో వేలం వేస్తామని సీఐ బి.అశోక్‌ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో జరిగే ఈ బహిరంగ వేలంలో ఆసక్తి కలవారు ముందస్తుగా 50 శాతం ధరావత్తు చెల్లించి అర్హత కలిగిన గుర్తింపు పత్రాలతో వేలంలో పాల్గొనవచ్చునని వెల్లడించారు.

    📰 e-Paper Clip
    Google News Follow