• Other News
  • Live TV
  • ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద్

    Reporter
    Journalist Chinna Telangana  |  February 13, 2026, 1:25 pm
    ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద్

    వార్తపత్రిక, కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 13: ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడమే తన ప్రధాన లక్ష్యమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బి.ఆర్.ఎస్.ఎల్.పి. విప్ కె.పీ. వివేకానంద్ స్పష్టం చేశారు.
    కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిత్యం తన నివాసంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కె.పీ. వివేకానంద్ ప్రజల నుంచి వచ్చిన వివిధ సమస్యలు, వినతులను స్వీకరించారు
    ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు నీటి సరఫరా, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, పింఛన్లు తదితర అంశాలపై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
    అలాగే ప్రజలు తమ కుటుంబ, సామాజిక, ధార్మిక వివిధ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ఎమ్మెల్యే కి అందజేశారు
    ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
    ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సంక్షేమ సంఘాల సభ్యులు, అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow