• Other News
  • Live TV
  • వార్తా పత్రిక గండిపేట నార్సింగ్ సర్కిల్ పరిధిలోని

    Reporter
    Journalist Chinna Telangana  |  February 4, 2026, 4:40 pm
    వార్తా పత్రిక గండిపేట నార్సింగ్ సర్కిల్ పరిధిలోని

    మణికొండ శ్రీ వెంకటేశ్వర కాలనీలో ప్రజా ఉపయోగ స్థలాలపై జరిగిన ఆక్రమణల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
    హైడ్రా పరిశీలనలో కమ్యూనిటీ హాల్ స్థలానికి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ నకిలీ అని గుర్తించబడింది. 1996 టెంటేటివ్ లేఅవుట్‌ను ఆమోదించబడిన లేఅవుట్‌గా చూపిస్తూ, లేఅవుట్‌లో ఉన్న ప్లాట్ల వివరాలను ఆధారంగా చేసుకుని భూకబ్జాదారులు ఇప్పటికే కమ్యూనిటీ హాల్ మరియు సెప్టిక్ ట్యాంక్ స్థలాలను ఆక్రమించినట్లు హైడ్రా గుర్తించినట్లు సమాచారం.
    హైడ్రా పరిశీలనలో సెప్టిక్ ట్యాంక్ స్థలం విషయంలో అక్రమంగా హౌస్ నంబర్ అసెస్‌మెంట్ ఆధారంగా హెచ్‌ఎమ్‌డీఏ అనుమతులు పొందినట్లు గుర్తించబడింది. అనంతరం జరిగిన విచారణలో సంబంధిత ఎల్‌ఆర్‌ఎస్ నకిలీ అని హెచ్‌ఎమ్‌డీఏ నిర్ధారించినట్లు హైడ్రా తెలిపింది.
    ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రా అధికారులు ఇప్పటికే ఆక్రమణకు గురైన స్థలంలో నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
    కాలనీ అసోసియేషన్ సభ్యులు దాఖలు చేసిన కోర్టు రిట్ పిటిషన్ నేపథ్యంలో, హైడ్రా ద్వారా ఓపెన్ స్పేస్, సెప్టిక్ ట్యాంక్ మరియు కమ్యూనిటీ హాల్ స్థలాల పునరుద్ధరణ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

    📰 e-Paper Clip
    Google News Follow