• Other News
  • Live TV
  • రాణి కుముదిని దేవి సేవలు చిరస్మరణీయం

    Reporter

    Deprecated: htmlspecialchars(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/vaarthapatrika.com/public_html/single.php on line 257
    January 23, 2026, 5:39 pm
    రాణి కుముదిని దేవి సేవలు చిరస్మరణీయం

    రాందేవ్ హాస్పిటల్ లో ఘనంగా జయంతి వేడుక

    కూకట్‌పల్లి : 1960 దశాబ్దంలో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్‌గా సేవలందించిన విద్యావేత్త, సంఘ సంస్కర్త, నిస్వార్థ రాజకీయవేత్త రాణి కుముదిని దేవి జయంతిని పురస్కరించుకుని శివానంద రిహబిలిటేషన్ హోమ్, రాందేవ్ రావు హాస్పిటల్, కుముదిని దేవి స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు.

    అట్టడుగు వర్గాలు, కుష్టు వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం కృషి చేసిన రాణి కుముదిని దేవి సమాజం నుంచి వెలివేయబడిన కుష్టు వ్యాధిగ్రస్తులకు ఆశ్రయం కల్పిస్తూ శివానంద రిహబిలిటేషన్ హోమ్‌ను స్థాపించారు. అలాగే సమాజంలోని అన్ని వర్గాలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే లక్ష్యంతో రాందేవ్ రావు హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు.

    జయంతి కార్యక్రమాల్లో భాగంగా రాందేవ్ రావు హాస్పిటల్‌లో రాణి కుముదిని దేవి చిత్రపటానికి హాస్పిటల్ ఎండీ డా. కమలాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సులు, పరిపాలనా విభాగం సిబ్బంది పాల్గొని ఆమె చేసిన సేవలను స్మరించారు.

    శివానంద రిహబిలిటేషన్ హోమ్‌లో ఏర్పాటు చేసిన రాణి కుముదిని దేవి విగ్రహానికి రంతిదేవ్ రావు, మీరా రావు, విక్రందేవ్ రావు, జ్యోతి రావు, విజయలక్ష్మి, పృథ్వీరెడ్డి, భారతి రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, అపర్ణ రావు, ప్రశాంత్ రెడ్డి, సీఏఓ డా. అనంత్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

    అలాగే జస్టిస్ జగన్నాద్ రెడ్డి సతీమణి పరిమళ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత శివానంద ఫిజియో రిహ్యాబ్ సెంటర్‌ను ప్రదీప్ చౌదరి ప్రారంభించారు. పరిమళ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని జయరాం పింగళి, ఊర్మిళ పింగళి, గౌతమ్ పింగళి, సురేఖ పింగళి, విద్యాసాగర్ రావు, దీపిక ఆవిష్కరించారు.

    తదనంతరం కుముదిని దేవి స్కూల్ అండ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో కొత్తగా చేరిన బీఎస్సీ, జీఎన్‌ఎం విద్యార్థులకు లాంప్ లైటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రతిజ్ఞను మేరీ డేవిడ్, కాలేజ్ ప్రిన్సిపాల్ అర్చన విద్యార్థులతో చేయించారు.

    ఈ కార్యక్రమంలో రాందేవ్ రావు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డా. కమలాకర్, సీఈవో డా. యోబు సహా హాస్పిటల్, కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow