• Other News
  • Live TV
  • రిపోర్టర్ లక్ష్మీనారాయణపై దాడి చేసిన మనీషా నాయర్‌ను అరెస్ట్ చేయాలి

    Reporter
    Journalist Chinna Telangana  |  May 4, 2026, 4:21 pm
    రిపోర్టర్ లక్ష్మీనారాయణపై దాడి చేసిన మనీషా నాయర్‌ను అరెస్ట్ చేయాలి

    కళ్యాణదుర్గం, వార్తాపత్రిక ప్రతినిధి
    రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి భౌతిక దాడులకు పాల్పడిన గీతం కాలేజ్ నిర్వాహకురాలు మనీషా నాయర్‌తో పాటు ఆమె అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కళ్యాణదుర్గం రిపోర్టర్స్ డిమాండ్ చేశారు.
    జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం కళ్యాణదుర్గం డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోజరుగుతున్న అక్రమాలు,అన్యాయాలు,అవినీతి,ఆరోపణలను ప్రజల ముందుకు తీసుకురావడం పాత్రికేయుల విధి ధర్మమని పేర్కొన్నారు.
    వార్తపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా కోర్టును ఆశ్రయించి న్యాయం కోరవచ్చని, కానీ గుండాగిరి చేస్తూ ఇంటికి వెళ్లి భౌతిక దాడులకు పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌ను అవమానించేలా కాళ్లు మొక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం సమాజం తలదించుకునే ఘటనగా అభివర్ణించారు.ఇటీవలి కాలంలో దళితులపై, జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, సామాన్య ప్రజలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ కార్యక్రమంలో డి. నరేష్ కుమార్, కె. రాజేష్, బండి సుధా, మల్లికార్జున, అస్లం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow