• Other News
  • Live TV
  • రేణుక ఎల్లమ్మ తల్లి కృప భక్తులందరిపై ఉండాలి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

    Reporter
    Journalist Chinna Telangana  |  February 22, 2026, 5:16 pm
    రేణుక ఎల్లమ్మ తల్లి కృప భక్తులందరిపై ఉండాలి  ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

    కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 22 వార్తాపత్రిక, గాజులరామారం డివిజన్‌లో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర, కళ్యాణోత్సవ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కృపా కటాక్షాలు భక్తులందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సమృద్ధిగా జీవించాలని ప్రార్థించారు. జాతర, కళ్యాణోత్సవ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow