• Other News
  • Live TV
  • మెట్టుకానిగూడలో మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు

    Reporter
    Journalist Chinna Telangana  |  February 22, 2026, 3:57 pm
    మెట్టుకానిగూడలో మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు

    కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 22 (వార్తాపత్రిక): శ్రీ మల్లికార్జున స్వామి దయతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొలను హన్మంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకొని, నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా వర్ధిల్లాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow