• Other News
  • Live TV
  • అమ్మవారి సన్నిధిలో హన్మంత్ రెడ్డి

    Reporter
    admin January 28, 2026, 8:25 pm
    అమ్మవారి సన్నిధిలో హన్మంత్ రెడ్డి

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్‌లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ–పొచమ్మ తల్లి దేవాలయ 21వ వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలను హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ అమ్మవారి దీవెనలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
    అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదాన వితరణ చేశారు.
    ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow