• Other News
  • Live TV
  • లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలను మానుకోవాలి

    Reporter
    Journalist Chinna Telangana  |  April 23, 2026, 5:22 pm
    లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలను మానుకోవాలి

    మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్

    పిసి ఘోష్ నివేదిక తప్పు అనే విషయం హైకోర్టు తీర్పుతో వెల్లడి అయింది

    ఇప్పటికైనా ప్రభుత్వం కేసీఆర్, హారీష్ రావులను బదులాం చేయడం మానుకోవాలని సూచన
    వార్త పత్రిక షాద్ నగర్ ఏప్రిల్ 23:తెలంగాణ రాష్ట్రంలోని రైతంగానే ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ 94 వేల కోట్ల నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. పిసి ఘోష్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రావాలని, ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులను పూర్తిచేసిన కేసీఆర్, హరీష్ రావులను బదులాం చేయాలని ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలు గమనించారని, హైకోర్టు తీర్పుతోనైనా నేతల ఆలోచనలు మార్పు రావాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బ్యారేజీలు, భారీ కెనాల్సు, మినీ కాలువలు ఎన్నో ఉన్నాయని, వాటికి అవసరమయ్యే సబ్స్టేషన్లు, మోటార్లు వంటి మౌలిక వసతులను కల్పించారని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ లోని కేవలం రెండు పిల్లర్లుకు పగుళ్లు వస్తే ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది అనే రీతిలో ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరును ప్రపంచ దేశాలు సైతం అభినందించాయని, సాగునీటి నిపుణులు సైతం ప్రశంసంచారని పేర్కొన్నారు. నేడు లక్షలాది ఎకరాలకు నీళ్లలో అందిస్తున్న ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయాలకు పాల్పడడం సరికాదని, ఇప్పటికైనా కాళేశ్వరం ద్వారా పూర్తిస్థాయిలో నీళ్లు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

    📰 e-Paper Clip
    Google News Follow