Banner
Watermark
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎటపాక వైకాపా నాయకులు
📅 05 June 2026, 07:01 PM ✍️ admin
News Image
ఎటపాక,జూన్ 5, వార్త పత్రిక:కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనంత దగా మరియు మోసపూరితమని ఎటుపాక మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పాలనకు మారుపేరైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసి అధికార పీఠాన్ని దక్కించుకున్న కూటమి ఈరోజు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, సూపర్సిక్స్ హామీలను కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసగించిన తెలిపారు.18 నుంచి 50 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలకు ఆడబిడ్డ నిధి అందిస్తామని చెప్పి ఇప్పటివరకు దాని గురించి ఒకసారి కూడా నోరు ఎత్తలేదు , యువతకు ఉపాధి చూపించకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పే మోసం చేశారు. ప్రకటనల్లో మాత్రం భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని చెప్పి వారి సొంత మీడియాలో డప్పు కొట్టుకుంటున్నారు తప్ప ఏ ఒక్కరికి ఉపాధి చూపించలేదన్నారు. మెగాడిఎస్సి పేరిట మోసం చేసిందని భారీ ఎత్తున యువత నష్టపోయారని తెలిపారు. అంతేకాకుండా స్పోర్ట్స్ కోటాలో భారీ ఎత్తున ఉద్యోగాలు అమ్ముకున్నట్లు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత ఈ రెండేళ్ల పాలనకు వెన్నుపోటు అనే నిరసన కార్యక్రమం భారీగా ఎటపాక మండల వైకాపాశ్రేణులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకుల వెంకట రామారావు (పెద్దోడు) రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకటేశ్వర్లు, గుండాల ఎంపిటిసి గొంగడి వెంకట రామిరెడ్డి, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దామెర్ల రేవతి, మండల మహిళా అధ్యక్షురాలు గుడిమల్ల నాగలక్ష్మి, యువజన విభాగం అధ్యక్షులు తోట శశి కుమార్ మాజీ సర్పంచ్ బుద్ధ ఆదినారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు సారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆకుల దయాకర్ శీలం నాగేశ్వరరావు ముత్తి బోయిన రాము, చళ్ల మణి మాచర్ల బాబురావు, కుచ్చులపాటి వెంకటేశ్వర్లు , చందా శేఖర్ రెడ్డి, బా రెడ్డి నరేందర్ రెడ్డి, గుజ్జుల దేవేందర్ రెడ్డి ఎర్ర గొల్ల నరసింహారావు, నోముల కృష్ణ ,మై సాక్షి రాకేష్, బారెడ్డి లక్ష్మారెడ్డి భోగాల వీరారెడ్డి, భోగాల రఘువర్ధన్ రెడ్డి సిలివేరి కోటేశ్వరరావు, కాటం స్వరూప, కొప్పుల అలివేలమ్మ, సింగిరెడ్డి గోపిరెడ్డి ఎర్ర గొర్ల రామకృష్ణ ముక్కు కల్పన, కాకాని సురేష్, కొత్తపల్లి సతీష్, కొత్తపల్లి సాత్విక్, కాకాని ఆకాష్, నడిపిండి చరణ్, ముక్కు జయరాం, మల్లు శేఖర్ రెడ్డి, చిలువేరు భద్రయ్య పల్లపు శీను, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
🏠 Home