Banner
Watermark
ప్రపంచ పర్యావరణ దినోత్సవ అవగాహన ర్యాలీ.
📅 05 June 2026, 05:32 PM ✍️ admin
News Image
కూనవరం, జూన్ 5, వార్త పత్రిక: పండ్రాజుపల్లి గ్రామం కూనవరం మండలం పోలవరం జిల్లా లోని ఐటీసీ బంగారు భవిష్యత్ వారి సహకారంతో సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది చిన్న ఆర్కుర్ పంచాయతీ పరిధిలో గల గ్రామ రైతులకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క అవగాహన ర్యాలీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ గణేష్ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించడం జరిగింది అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలని అదేవిధంగా నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది బుద్ధుల నాగేశ్వరరావు అబ్దుల్ రజాక్ వేల్పుల సురేష్ కరక వీరబాబు మరియు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది
🏠 Home