Banner
Watermark
గులాబీ జెండా… తెలంగాణ ప్రజలకు కొండంత అండా : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు...
📅 26 May 2026, 11:17 PM ✍️ M.Chinna
News Image
ఈరోజు 125 - గాజుల రామారం డివిజన్ కైసర్ నగర్ లో మాజీ వార్డ్ మెంబర్, డివిజన్ ఉపాధ్యక్షులు ఎం.డి.మసూద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారి చేతులమీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...గులాబీ జెండా… తెలంగాణ ప్రజలకు కొండంత అండా అని, తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి చక్కటి వేదిక పార్టీ కార్యాలయాలు అని అన్నారు. అంతక ముందు పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన జెండా ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ రాంరెడ్డి, రుద్ర అశోక్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు అంజన్ గౌడ్, కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home