చౌటుప్పల్, మే 12,(వార్త పత్రిక);రైతు ముంగింట్లో శాస్త్ర వేత్తలు,అనే కార్యక్రమం
చౌటుప్పల్ మండలం లోని రైతువేదికలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమం లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డా.ప్రభావతి వచ్చే వానాకాలంలో సాగు చేసే ప్రధాన పంటలలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను మరియు సస్య రక్షణ చర్యల గురించి ముఖ్యంగా వరిలో సన్న ధాన్యం రకలైనా బీపీటీ 5204,ఆర్ఎన్ఆర్ 15048,కే ఎన్ఎం1638, డబ్ల్యూజిఎల్ (సిద్ది ), హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్ వంటి రకాలను సాగు చేసి అధిక దిగుబడితో పాటు ప్రభుత్వం ఇచ్చే క్వింటాలు కు 500 రూపాయల బోనస్ పొందవచ్చాన్నారు మరియు ఏంటీయు 1010,కేఎన్ఎం
118,వంటి దొడ్డు రకాలను సాగు చేసి గ్రేడ్ ఏ క్రింద మద్దతు ధర పొందవచ్చన్నారు, యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడాలన్నారు, యూరియాను ఏకారినికి 2 బస్తాలకు మించి వాడొద్దాన్నారు,వరి లో ముఖ్యంగా కాండం తొలిచే పురుగు నివారణకు నాటు పెట్టడానికి వారం రోజుల ముందు ఒక సెంట్ నారుమడికి 2 కిలోల కార్బొ ఫురాన్ 4జి గుళికలు వేయాలి మరియు నాటు పెట్టిన 15 రోజులకు ఒకసారి ఏదైనా పురుగు మందు స్ప్రే చేసి నట్లయితే మొగి పురుగు నుండి పంటను కాపాడవచ్చు. దోమపోటు నివారణకు కాళిబాటలు తీయాలి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య శాస్త్రవేతలు,వ్యవసాయ ధికారుల సూచనల మేరకు విత్తణాలు, ఎరువులు వాడాలన్నారు, ప్రతి రైతు భూసారా పరీక్షలు చేసియించు కోని ఫలితాల ఆధారంగా ఎరువులు వాడి సాగు ఖర్చు తగ్గించుకొని అధిక దిగుబడిని పొందాలన్నారు మరియు సేంద్రియ వ్యసాయం వైపు మల్లాల్సిన సమయం వచ్చి దన్నారు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ఒక ఎకరా వరికి సరిపడే నీటి తో 3 ఎకరాల ఆయిలపామ్ మరియు కూరగాయలు సాగు చేసి నీకారాదాయం అధికంగా పొందవచ్చాన్నారు మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వైస్ చైర్మన్ చేన్నాగోని అంజయ్య శాస్త్ర వేత్తల సలహాలు, సూచనలు పాటించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాచన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొసనం రాకేష్ రెడ్డి,పొల్లేపల్లి లక్ష్మీ,రెడ్డి బావి సర్పంచ్ నందగిరి వెంకట్,వ్యవసాయ విస్తరణ అధికారులు,రైతులు పాల్గొనడం జరిగింది