Banner
Watermark
నీట్ పేపర్ లీక్ కి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
📅 13 May 2026, 03:21 PM ✍️ M.Chinna
News Image
చౌటుప్పల్, మే 13,(వార్త పత్రిక);చౌటుప్పల్ మండలం కేంద్రం లో నీట్ 2026 పేపర్ లీక్ జరిగినట్లు నిర్ధారణ కావడంతో పరీక్ష రద్దు చేసిన సందర్బంగా చౌటుప్పల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల కేంద్రం లో విద్యార్థులకు సంఘీభావంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్లెక్సీ ఫోటోని దహనం చేసి నిరసన తెలియ చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోషిక వినయ్, నియోజకవర్గం అధ్యక్షులు అబ్బనబోయిన రామ కృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గత పది సవంత్సరాల గా 89 పరీక్ష పేపర్ లు లీక్ చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వం ది అని, సక్రమంగా పరీక్షలు కుడా నిర్వహించ లేని చేతకానీ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం అని తక్షణమే ఈ లీకేజి కి బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజినామ చేయాలి అని డిమాండు చేస్తూ ఈ లీకేజి వెనుక ఎంత పెద్ద నాయకుల హస్తం వున్నా వారి మీద కఠిన మైన చర్యలు తీసుకోవాలి అని డిమాండు చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాల మణికంఠ యాదవ్, నారాయణ పురం మండలం అధ్యక్షులు రెడ్యానాయక్, మండల కమిటీ కార్యదర్శులు పబ్బతి వెంకటేష్, ఆవుల రాజు,చింతల శివ, సీనియర్ నాయకులు పెద్దగోని రమేష్ గౌడ్,మాజీ టౌన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెరుకు లింగస్వామి,యువజన కాంగ్రెస్ నాయకులు తొర్పునూరి రవి గౌడ్,తీగుల్ల రాఘవేంద్ర,చింతకింది గణేష్, యాట సంతోష్, ముజాయిద్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home