ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను కలిసిన రాందాస్ ముదిరాజ్.
📅 09 May 2026, 08:17 PM
✍️ M.Chinna
వార్తాపత్రిక గండిపేట్: సహకార సంఘాల చైర్మన్ పదవి కాలాన్ని కొనసాగించాలని హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైదర్ షాకోట్ సహకార సంఘం చైర్మన్ గా రాందాస్ ముదిరాజ్ కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవి స్వీకరణ పత్రాన్ని కలెక్టర్ నుంచి పొందిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మర్యాదపూర్వకంగా ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.