Banner
Watermark
కర్లపల్లిలో విషాదం లేగ దూడను కాపాడబోయి బావిలో పడి తండ్రీ కొడుకులు మృతి
📅 09 May 2026, 08:12 PM ✍️ M.Chinna
News Image
ములుగు జిల్లా (ప్రతినిధి)వార్త పత్రిక
గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లేగ దూడ బావిలో పడిపోవడంతో దానిని కాపాడేందుకు బావిలోకి దిగిన తండ్రి రసపుత్రు రాజు, కుమారుడు పవన్ఇద్దరూప్రాణాలుకోల్పోయారు.వివరాల్లోకి వెళ్తే, గ్రామ శివారులోని 35 అడుగుల లోతైన బావిలో లేగ దూడ ప్రమాదవశాత్తు పడిపోయింది. దానిని గమనించిన కుమారుడు పవన్ దూడను కాపాడేందుకు బావిలోకి దిగాడు కొడుకుకి ఏమైనా అవుతుందోనని ఆందోళన చెందిన తండ్రి రసపుత్రు రాజు కూడా వెంటనే బావిలోకి దిగాడు. అయితే వారు పైకి వస్తుండగా తాడు తెగిపోవడంతో ఇద్దరూ బావిలో పడి మునిగిపోయారు.సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తండ్రి రసపుత్రు రాజు మృతదేహాన్ని వెలికితీశారు. కుమారుడు పవన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో కర్లపల్లి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కసారిగా ఇద్దరిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
🏠 Home