చండూరు వార్తాపత్రిక మే 6
నల్గొండ డిపో మేనేజర్ రమణ కు వినతిపత్రం అందజేత..చండూరు:చండూరుమున్సిపాలిటీలోని ఆర్టీసీ బస్టాండుకు ప్రతిరోజు అనేక బస్సులు తిరుగుతుంటాయని, అందులో కొన్ని బస్సులు నల్గొండ నుండి చండూరుకు వచ్చే లోకల్ బస్సులు చండూరు బస్టాండ్ లోనే ప్రయాణికులను దింపుతున్నాయని, చండూరు బస్టాండ్ టౌన్ కు దూరంగా ఉంటుందని, కావున ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని, లోకల్ బస్సులన్నీ చండూరు వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చి దింపాలని మరియు ఉదయం నల్లగొండకు వెళ్లే బస్సులు వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లాలని నల్గొండ డిపో మేనేజర్ రమణకు చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు వినతిపత్రం ఇవ్వగా వెంటనే స్పందించిన నల్లగొండ డిపో మేనేజర్ రమణ రెండు రోజుల్లోనే మీ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారని అన్నారు.
మున్సిపల్ చైర్మన్ వెంట కౌన్సిలర్లు కటకం రమేష్, బుషిపాక వాసు, కో ఆప్షన్ మెంబర్ కల్లెట్ల చంద్రకళ మారయ్య, గజ్జల కృష్ణారెడ్డి, బోడ. విజయ్ తదితరులు ఉన్నారు.