Banner
Watermark
ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లు న్యాయ బద్దమైనవి ప్రభుత్వం వెంటనే కల్పించుకొని వారికి న్యాయం చేయాలి
📅 24 April 2026, 03:28 PM ✍️ M.Chinna
News Image
వార్త పత్రిక షాద్ నగర్ ఏప్రిల్24:
ఎన్నికలో ఇచ్చిన హమీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
బలవత్ మరణానికి పాల్పడి మరణించిన శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి చిన్నోళ్ల అనంతయ్యసామాజిక ఉద్యమ నాయకులు ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను నెరవేర్చాలి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం నుండి నేటి వరకు ఆర్టీసీ కార్మికుల సమస్య లపై పోరాడుతూనే ఉన్నారు.ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆర్టీసీ కార్మికుల సమస్య లు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది.ప్రత్యేక రాష్ట్రమ్ కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటం నేటికి మరువలేనిది ఎంతో మంది కార్మికులు ప్రాణ త్యాగాలు కూడా చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఎంతగానో కృషి చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులది కదా వాళ్ళు అడుగుతున్న కోరికలు అవి ఎం కొత్తవి కావు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన మేనిపెస్టో లో ఉన్నవే వాళ్ళు అడుగుతున్నరు . అలాంటపుడు వాళ్ళ డిమాండ్లను నెరవేరుస్తే తప్పేంటి ప్రభుత్వాలు రాకముందు కార్మికులకు మద్దతుగా నిలబడటం ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వాళ్ళ హక్కులను తుంగలో తోక్కే అలవాటు మన రాజకీయ నాయకులకు దాపరించింది.ఇది ప్రభుత్వాలకు తగునా అని అడుగుతున్నాం.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను సాధించే వరకు వాళ్లకు మా పూర్తి మద్దతు ప్రకటిస్తూ వాళ్ళ పోరాటంలో బాగసాములము అవుదాం. అని తెలిపారు.
🏠 Home