Banner
Watermark
ఏళ్ల నాటి సమస్యకు పరిస్కారం చూపిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్
📅 22 April 2026, 02:51 PM ✍️ M.Chinna
News Image
వార్తాపత్రిక ప్రతినితి అనంతపురం
యాదవపురం పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు .
శెట్టూరు మండలం యాదవపురం గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఏళ్ల నాటి సమస్యకు ఎట్టకేలకు *ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ పరిష్కారం లభించింది. పాఠశాలలోని 28 మంది విద్యార్థుల కోసం గతంలో ప్రారంభించిన మరుగుదొడ్ల నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోవడంతో, విద్యార్థులు బహిర్భూమికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన మండల విద్యాశాఖ అధికారి-2 ఎంఈఓ వాణిదేవి పాఠశాల ఉపాధ్యాయులు కలిసి ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగా. సానుకూలంగా స్పందించి నిర్మాణాన్ని పూర్తి చేశారు.​నేడు పునర్నిర్మించిన బాత్‌రూములను విద్యార్థుల వినియోగం కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ట్రస్ట్ సభ్యుల సేవా దృక్పథాన్ని కొనియాడారు.​విద్యార్థుల కష్టాలకు
​గత కొంతకాలంగా మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి, చొరవ తీసుకున్న ఎంఈఓ ఉపాధ్యాయ బృందాన్ని గ్రామస్తులు అభినందించారు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ సౌకర్యం ఎంతో అవసరమని, స్వచ్ఛంద సంస్థలు ఇలా ముందుకు రావడం శుభపరిణామమని వక్తలు పేర్కొన్నారు.​తమ విన్నపాన్ని మన్నించి, పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల కు పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో​వాణిదేవి మండల విద్యాశాఖ అధికారి-2,పాఠశాల ఉపాధ్యాయులు రాజన్న, వన్నూరుస్వామి,
​పూర్వపు ఉపాధ్యాయులు మల్లికార్జున, వరలక్ష్మిట్రస్ట్ సభ్యులు మహేష్, తిప్పేస్వామి, విష్ణు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home