తమిళనాడు BJP అభ్యర్థుల జాబితా విడుదల-బరిలో తమిళసై- అన్నామలై పేరు మిస్సింగ్!
తమిళనాడులో మొత్తం 27స్థానాలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరజన్ మైలపోర్ నుంచి బరిలోకి దిగనున్నారు. కేంద్రమంత్రి ఎల్.మురుగన్ కు అవనాషి సీటు కేటాయించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కుకోయంబత్తూర్-నార్త్, రాష్ట్ర బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ కు సాత్తూర్ టికెట్ ఇచ్చారు.
అయితే, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు అభ్యర్థుల జాబితాలో లేదు. సీట్ల సర్దుబాటులో భాగంగా కోయంబత్తూర్, ఈరోడు సీట్లు బీజేపీకి రాలేదనే అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తువల్ల బీజేపీ ప్రయోజనాలు దెబ్బతిన్నట్లు దిల్లీ పెద్దలకు అన్నామలై లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, ఎన్డీయే తరఫున ప్రచారం చేస్తారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 2021 ఎన్నికల్లో 20స్థానాల్లో పోటీచేసిన బీజేపీ ఈసారి మరో 7 సీట్లు పెంచుకుంది