ఇరాన్‌పై 850 తోమహాక్ క్షిపణుల ప్రయోగం..
📅 28 March 2026, 04:45 PM
✍️ M.Chinna
పశ్చిమాసియా ) లో భీకర యుద్ధం సాగుతోంది. ఇరాన్ () పై ఇజ్రాయెల్ () క్షిపణులు (), డ్రోన్‌ల () తో విరుచుకుపడుతుండగా.. ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తున్నది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి అమెరికా 850 తోమహాక్ క్రూయిజ్ క్షిపణుల () ను ప్రయోగించింది. ఈ సంఖ్య అమెరికా రక్షణవర్గాలను కలవరానికి గురిచేస్తున్నది. ఎందుకంటే సగటున అమెరికా ఒక ఏడాదికి కొనుగోలు చేసే క్షిపణుల సంఖ్య వాటికంటే 9 రెట్లు ఎక్కవ ఉందట.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గణాంకాల ప్రకారం.. అమెరికా ఏడాదికి 90 వరకు తోమహాక్ క్షిపణులను కొనుగోలు చేస్తుంటుంది. 2026 ఏడాదికి యూఎస్ నేవీ నుంచి 57 మిస్సైళ్లకే రిక్వెస్ట్ వచ్చిందని యూఎస్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ బడ్జెట్ పత్రాల ద్వారా వెల్లడవుతోంది. ప్రస్తుతం భారీ స్థాయిలో వీటిని వినియోగించడంతో అవి తరిగిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే ట్రంప్ యంత్రాంగం మాత్రం అలాంటిది ఏమీ లేదని చెబుతోంది. క్షిపణులు తరిగిపోతున్నాయనే వార్తలు అవాస్తవమని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.