Banner
Watermark
పీజీ హాస్టల్‌లో ల్యాప్‌టాప్ చోరీల గుట్టురట్టు
📅 02 February 2026, 12:13 AM ✍️ M.Chinna
News Image
దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి ప్రాంతంలో పీజీ హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన వరుస ల్యాప్‌టాప్ దొంగతనాల కేసును ఛేదించినట్లు దుండిగల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం ఏడు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే.. బహదూర్‌పల్లి లోని ఓ పీజీ హాస్టల్‌లో జనవరి 24వ తేదీ తెల్లవారుజామున చోరీ జరగగా, రెండు ల్యాప్‌టాప్‌లు అపహరణకు గురయ్యాయి. అదే ప్రాంతంలో జనవరి 26వ తేదీ తెల్లవారుజామున మరోసారి పీజీ హాస్టల్‌లోని వివిధ గదుల నుంచి మొత్తం ఏడు ల్యాప్‌టాప్‌లు దొంగిలించబడ్డాయి. ఈ ఘటనలపై దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

దర్యాప్తులో భాగంగా, దుండిగల్ పోలీస్ స్టేషన్ క్రైం టీం ఈ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో బహదూర్‌పల్లి ఎక్స్‌రోడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడే చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, రిసీవర్ వద్ద నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గంగనమోని అన్వేష్ కుమార్ (20)ను, రిసీవర్‌గా మయూర్ అశోల్ మేవాడా (46)ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ల మొత్తం విలువ సుమారు ₹.3.50 లక్షలు ఉంటుందని తెలిపారు.
🏠 Home