Banner
Watermark
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 03వ వార్డులో ఇంటింటి ప్రచారం ప్రారంభించిరాంబాబు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్
📅 01 February 2026, 04:28 PM ✍️ M.Chinna
News Image
వార్త ప్రతిక:-తొర్రూర్

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో 03వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వార్డులో జరుగుతున్న ప్రచారాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పాటి రాంబాబు గెలుపు ఖాయమని స్థానిక ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.03వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తూర్పాటి రాంబాబు తరఫున పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు రాంబాబు చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 03వ వార్డులో ఇంటింటి ప్రచారం ప్రారంభించి, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాటికి ప్రాధాన్యతనిస్తూ పరిష్కారాలు చేపడతామని హామీ ఇచ్చారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ. తూర్పాటి రాంబాబు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కష్టసమయాల్లో కూడా పార్టీతోనే నిలిచిన వ్యక్తి అని తెలిపారు. అందుకే ఈసారి ప్రజల ముందుకు మళ్లీ వచ్చే అవకాశం వచ్చిందని, గతంలో జరిగిన లోపాలను మరిచి ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తూర్పాటి రాంబాబు ని గెలిపిస్తే 03వ వార్డును అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటింటి ప్రచారంతో 03వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడగా, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
🏠 Home