Banner
Watermark
గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ పోటీలు
📅 31 January 2026, 05:49 PM ✍️ M.Chinna
News Image
సిఎం కప్ క్రీడలు ప్రారంభం
దుబ్బాక : వార్త పత్రిక:
గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ క్రీడలు నిర్వహిస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి, ఎంపిడిఓ భాస్కర్ శర్మ తెలిపారు. శని వారం మండల కేంద్రంలో సీఎం కప్ రెండవ ఎడిషన్ మండల స్థాయి క్రీడలను వారు ప్రారంభించి మాట్లాడారు. పల్లెలోని యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని, దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా లభిస్తుందన్నారు. క్రీడాకారులు ఎంచుకున్న క్రీడల్లో కష్టపడి రాణిస్తే పల్లె స్థాయి నుండి ప్రపంచ స్థాయి ఛాంపియన్లుగా ఎదుగొచ్చన్నారు. సీఎం కప్ క్రీడ‌ల ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందన్నారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయనీ గ్రామీణ క్రీడాకారులు,విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల అధికారులు తెలిపారు.
🏠 Home