Banner
Watermark
మహబూబాబాద్ జిల్లా మహిళా కో కన్వీనర్ బిఎస్పీ పార్టీ కి నవత రాజీనామా వార్త ప్రతిక :-మరిపెడ
📅 29 January 2026, 02:47 PM ✍️ Editor
News Image
బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళా కో కన్వీనర్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాషిపంగు నవత తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లడుతూ గత కొన్ని సంవత్సరాలక్రితం అప్పటి జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాములు ప్రోత్బలంతో పార్టీలో చేరి మరిపెడ మండల మహిళా కన్వీనర్ గా, డోర్నకల్ అసెంబ్లీ మహిళా కన్వీనర్ గా పనిచేసి ప్రస్తుతం జిల్లా కో కన్వీనర్ గా కొనసాగుచున్నట్లుగా తెలిపారు, ప్రస్తుత పరిస్థితులు, కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని విడుచున్నట్లు, భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆమె తెలిపారు
🏠 Home