Banner
Watermark
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మహంకాళి నగర్‌లో ఘనంగా నిర్వహణ
📅 27 January 2026, 08:21 PM ✍️ Editor
News Image
వార్త పత్రిక, ఆల్విన్ కాలనీ : భారత్ దేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుడి రాజు ఆధ్వర్యంలో మహంకాళి నగర్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సాధించిన మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
మహంకాళి నగర్ అభివృద్ధికి ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువత మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని జెండా పండుగను విజయవంతం చేశారు. జాతీయ గీతాలాపన, దేశభక్తి నినాదాలతో మహంకాళి నగర్ ప్రాంతం మార్మోగింది. కార్యక్రమం మొత్తం దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా సాగింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తి భావాలను మరింత బలపరిచిందని నిర్వాహకులు తెలిపారు.
🏠 Home