Banner
Watermark
టెంజు నూతన కమిటీ ఏర్పాటు
📅 23 January 2026, 07:12 PM ✍️ Editor
News Image
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కన్వీనరుగా ఎర్రోళ్ల కృష్ణ

కో-కన్వీనర్‌గా ఉదయ్ కుమార్‌ను ఏకగ్రీవంగా నియమకం

కుత్బుల్లాపూర్ : తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కన్వీనర్‌గా ఎర్రోళ్ల కృష్ణ, కో-కన్వీనర్‌గా ఉదయ్ కుమార్‌ ఏకగ్రీవంగా నియమించారు.

రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కోలా వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలెపాక వెంకట్ ఆధ్వర్యంలో కమిటీ ఎంపిక జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ సమర్థంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
🏠 Home