Banner
Watermark
కుత్బుల్లాపూర్‌లో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: లబ్ధిదారులకు రూ.3 లక్షల సహాయం
📅 05 January 2026, 05:32 PM ✍️ Editor
News Image
ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన బలోపేతమవుది : కూన శ్రీనివాస్ గౌడ్
షాపూర్ నగర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం:
కెకెఎం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ (Chief Minister’s Relief Fund) కింద మొత్తం రూ.3 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం షాపూర్ నగర్‌లో ఆయన నివాసం వద్ద జరిగింది.

ఇటీవల అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన దమ్మలపాటి ఆచార్య, అక్కిరెడ్డి సత్తిబాబు, బొక్క ధరణి, మిరాకుల ఝాన్సీ, ముత్యపాగ జానకి గతంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తుల మేరకు మంజూరైన చెక్కులను ఈ రోజు కూన శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన బలోపేతమవుతోందని, మంత్రివర్యులు శ్రీధర్ బాబు ప్రత్యేక కృషితో బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని కొనియాడారు. అలాగే ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజానర్సింహ నేతృత్వంలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పేదలకు అందించడం, చికిత్సకు అయ్యే ఖర్చులను సిఎంఆర్ఎఫ్ ద్వారా భరించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీనివాస్, మోటే శ్రీనివాస్ యాదవ్, చౌడ శ్రీనివాస్, కూన రాఘవేందర్ గౌడ్, నాగిళ్ల శ్రీనివాస్, భరత్ గౌడ్ (ఓబీసీ సెల్), ఉలిపి శ్యామ్, గౌరిశెట్టి శివ ఈశ్వరరావు, మక్బూల్ బాయ్, భరత్, రామకృష్ణారెడ్డి, యాదగిరి, బాలయ్య, నరేందర్, సత్యనారాయణ, శంకర్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home